మానవతా థృక్పథంతో క్లోరోక్విన్ సహా అవసరమైన ఇతర ఔషదాలపై ఉన్న నిషేధాన్ని భారత్ పాక్షికంగా ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాలకు మందుల సరఫరాను స్వాగతించిన రాహుల్...అత్యవసర, తప్పనిసరి మందుల ఎగుమతిపై భారత్ ఆలోచించాలని కోరాడు. అత్యవసర మందులను భారతీయులకు అందుబాటులో ఉంచాలని, ఇక్కడ సరిపడా ఉన్న తర్వాతే ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని తెలిపారు. భారత్ నుంచి పలు రకాల మెడిసిన్ ఎగుమతికి ప్రభుత్వం అనుమతిస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించడంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.