మీడియా సంస్థల్లో కరోనా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రిపోర్టర్లకు ఇవాళ్టి నుంచి వర్క్ ఫ్రమ్ హోం అనుమతించినట్లు సమాచారం. రిపోర్టర్లు, మార్కెటింగ్ ఉద్యోగులు, ఫీల్డ్‌లో తిరిగే ఇతర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించారు.
హైదరాబాద్ తో సహా ఢిల్లీ, ముంబై నగరాల్లోని ప్రతిక ఉద్యోగులకు (రిపోర్టర్లు, మార్కెటింగ్) వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించారు. వివిధ చోట్ల తిరిగే రిపోర్టర్లు, మార్కెటింగ్ సిబ్బంది కరోనా ట్రాన్స్మిటర్లుగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇచ్చారు.