అందరికీ హెల్త్‌ప్రొఫైల్‌ :మంత్రి హరీశ్‌రావు


 రాష్ట్రంలోని అందరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డిలో నేడు పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహిళా వసతిగృహాన్ని ప్రారంభించిన మంత్రి అనంతరం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కార్డియాలజీ, యూరాలజీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. జిల్లాల్లో కార్డియాలజీ, యురాలజీ సేవలు ప్రారంభించడం ఇదే తొలిసారన్నారు. అన్ని తాలూకా ఆస్పత్రుల్లో ఐసీయూ సేవలు తెచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదన్నారు. రూపాయి ఖర్చు లేకుండా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనితీరు మెరుగైందన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన కాన్పుల్లో 63 శాతం సాధారణ ప్రసవాలేనని మంత్రి పేర్కొన్నారు.