నగరంలో నూతనంగా మరో 227 బస్తీ దవాఖానాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నూతనంగా మరో 227 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే నిర్వహణలో ఉన్న 123 బస్తీ దవాఖానాలకు తోడు మరో 227 బస్తీ దవాఖానాలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం తెలిపినట్లు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. దీంతో మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 350కి చేరుతుందన్నారు. రానున్న మూడు నెలల్లో ఈ దవాఖానాలు హైదరాబాద్‌ వాసులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.